Start
End
దేశభాషలందు తెలుగు లెస్స – శ్రీకృష్ణదేవరాయలు
గీతాంజలి తెలుగు సభ
తేది: 02 11 2017.
గీతాంజలి తెలుగు సభ ఆధ్వర్యములో మన కళాశాలయందు తెలుగు భాషా దినోత్సవాన్ని తేదీ: 10. 11 .2017. మధ్యాహ్నము గం. 2 .00 లకు;నిర్వహించతలపెట్టినాము. మన కళాశాల దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గీతాంజలి తెలుగు సభ తృతీయ వార్షిక తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించడం ఆనందదాయకం. ఈ సమావేశమునకు ముఖ్య అతిధిగా ప్రముఖ రచయిత్రి డా. పాతూరి అన్నపూర్ణ గారిని ఆహ్వానించించడం జరిగింది. ఈసందర్బంగా విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలను క్రింద సూచింపబడిన అంశాలలో నిర్వహించుచున్నాము. కావున విద్యార్థినీ విద్యార్థులందరూ పోటీలలో పాల్గొని తెలుగు భాష ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని భావి తరాలకు తెలియచెప్పగలరని కోరుచున్నాము.
1) తేదీ: 04. 11 .2017. ఉదయం గం. 11 :00 లకు; వేదిక: నూతన సమావేశ మందిరము
అంశము: వ్యాసరచన
విషయము: శ్రీకృష్ణదేవరాయల సంస్థానం లోని అష్టదిగ్గజాలు తెలుగు భాషకు చేసిన సేవలు
2) తేదీ: 04. 11 .2017. మధ్యాహ్నము గం. 2 .00 లకు; వేదిక: పాత సమావేశ మందిరము
అంశము: వక్తృత్వము
విషయము: తెలుగు భాష పూర్వపు ఔన్నత్యాన్ని పరిరక్షించడంలో విద్యార్థుల పాత్ర
ఫై పోటీలలో పాల్గొనదలచినవారు మీ తరగతి ఆచార్యుల అనుమతి తీసుకొని పైన తెలిపిన సమయానికి 10 నిముషాలు ముందుగా వేదిక దగ్గరకు రావలసినదిగా తెలియచేయడమైనది.
ధన్యవాదములు
ప్రధాన ఆచార్యులు
అధ్యక్షులు
గీతాంజలి తెలుగు సభ